మునుగోడులో ప్రచారం జోరందుకుంది. ప్రత్యర్థుల మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే.. తాజా టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కారు గుర్తును పోలిన వారితో పోటీకి దింపాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ప్రభాకర్ రెడ్డి పేరుతో ఉన్న వారిని మునుగోడు బరిలో దింపాలని బీజేపీ ప్రయత్నాలు చేసిందని, పరిశీలకులు వచ్చిన…సాయుధ బలగాలు వచ్చిన టీఆర్‌ఎస్ గెలుపు. బీజేపీ డ్రామాలు బంద్ చేయాలి. ప్రజా కోర్టులో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అని ఆయన అన్నారు. మునుగోడు ఓటర్ల డ్రామాకు బీజేపీ తెరలేపింది. దొంగ ఓట్లు నమోదు చేయించిందే బీజేపీ, వాటిని అనుమతించేలా చేసింది కూడా బీజేపీ. కోర్టులకు వెళ్ళింది కూడా వీల్లే. దొంగే దొంగ అన్నట్టు ఉంది. 40 శాతం దొంగ ఓట్లు తొలగించారు అని బీజేపీ చెప్తోంది… అది చేసింది మీరే కదా? బీజేపీ ఓటమి తధ్యం అని తేలిపోయింది.
ఓట్లు పోయాయి కాబట్టి ఓడిపోయామని చెప్పటానికే ఈ ప్రయత్నం చేస్తున్నారు. దొంగ ఓట్ల నమోదుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది. దొంగ ఓట్లను ఆపే ప్రయత్నం చేస్తే బిజెపి కోర్టును ఆశ్రయించారు. ఏబీవీపీ,ఆర్ఎస్ఎస్ లు దొంగ ఓట్ల నమోదు కు ప్రయత్నాలు చేసాయి. రాజ్యాంగం బద్ధమైన సంస్థలపై టీఆర్ఎస్ కు నమ్మకం ఉంది. కోర్టుకు వెళ్లి ఓట్ల నమోదుపై బీజేపీ మొట్టికాయలు తిన్నది. మునుగోడు ప్రజానీకంకు తెలుసు… రాజ్ గోపాల్ రెడ్డి 18 వేల కోట్లకు అమ్ముడు పోయాడని అంటూ తీవ్ర విమర్శలు చేశారు.