‘భేడియా’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్.. ఇంట్రెస్టింగ్ గా వరుణ్ ధావన్ లుక్

-

బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో వరుణ్ ధావన్ తన కొత్త సినిమా అప్డేట్ తో మరోసారి ముందుకొచ్చారు. కృతి సనన్ తో జంటగా వరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ భేడియా. ఈ చిత్రబృందం తాజాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అమర్‌ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 25న రిలీజ్‌ కానుంది.

పోస్టర్‌తోనే సినిమాపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఈ పోస్టర్ లో వరుణ్ ధావన్ లుక్ అదిరిపోయింది. హార్రర్ లుక్ లో వరుణ్ అదరగొట్టేశాడు. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్‌ 19న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కామెడీ హర్రర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను మ్యాడ్ డాక్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై దినేష్ విజయ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దినేష్ విజన్‌.. హార్రర్‌ కామెడీ యూనివర్స్‌లో మూడో ఇన్‌స్టాల్‌మెంట్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. గతంలో ఈ యూనివర్స్‌లో తెరకెక్కిన స్త్రీ, రూహీ సినిమాలు భారీ విజయాలు సాధించాయి.

Read more RELATED
Recommended to you

Latest news