మునుగోడు ప్రచారానికి వెళ్లడంపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బాంబ్ పేల్చారు. మునుగోడు ప్రచారానికి హోంగార్డులు వెళ్లరని, ఎస్పీలే వెళతారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత పార్టీ నేతల పైనే సెటైర్లు వేశారు.
వంద కేసులు పెట్టిన వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తెస్తానని ఓ పెద్దాయన అన్నాడని, అలా అన్న పెద్దాయన గెలిపిస్తాడని చెప్పారు. మునుగోడు ప్రచారానికి వెళ్లకుండా తప్పు చేశావని గాంధీభవన్ లో విహెచ్, వెంకటరెడ్డిని ప్రశ్నించారు. అవమానిస్తే ఎలా వెళతానని వెంకటరెడ్డి సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన కన్నా మంచి లీడర్లు,హీరోలు ఉన్నారని తాను ప్రచారానికి వెళ్లాల్సిన అవసరమే లేదని చెప్పారు. వాళ్లే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలో తెచ్చుకుంటారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సెటైర్లు పేల్చారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.