అమరావతి రైతుల పాదయాత్ర బాధ్యత పోలీసులదే : ఏపీ హైకోర్టు

-

అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర బాధ్యత పోలీసులదేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. పాదయాత్రకు పోటీగా నిరసనకు తావులేకుండా పోలీసులే చూసుకోవాలని తేల్చి చెప్పింది. రైతుల పాదయాత్రను అడ్డుకుంటున్నారంటూ అమరావతి పరిరక్షణ సమితి, రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం రెండు రోజుల పాటు విచారణ చేపట్టింది.

పాదయాత్ర సజావుగా సాగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కోర్టు ముందు వివరాలు ఉంచాలని  న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో కోర్టుకు ఇరుపక్షాలు వివరాలను సమర్పించాయి. ఇరువైపుల వాదనలు, వారు సమర్పించిన వివరాలను పరిశీలించిన న్యాయస్థానం ఇవాళ తీర్పు వెల్లడించింది. పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని.. మద్దతు తెలిపేవారు రోడ్డుకు ఇరువైపుల ఉండి సంఘీభావం తెలపాలని పేర్కొంది.

గతంలో పాదయాత్రలో పాల్గొనేందుకు ఏయే వాహనాలకు అనుమతి ఉందో అవి మాత్రమే ఉండాలని సూచించింది. రైతుల పాదయాత్ర సజావుగా జరిగేలా, వారికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

Read more RELATED
Recommended to you

Latest news