బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డిజె టిల్లుకు సీక్వల్ గా డీజే టిల్లు 2 రాబోతోంది. ఈ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ హీరోగా మంచి పేరు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన డీజె టిల్లు సీక్వెల్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మొదట పెళ్లి సందడి హీరోయిన్ శ్రీ లీలను హీరోయిన్ గా అనుకున్నారు. కొన్ని కారణాలవల్ల ఆమె తప్పుకుంది. దీంతో అనుపమ పరమేశ్వరన్ ను ఈ సినిమాలో ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి దీపావళి కానుకగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమాలో అనుపమ ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ సినిమా నుంచి ఓ ప్రోమో వీడియోని కూడా రిలీజ్ చేసింది చిత్రం. ఈ వీడియోలో ఎప్పటిలాగే సిద్దు తనదైన స్టైల్ లో కామెడీని పండించాడు.