అక్టోబర్ 25న అనగా నేడు సూర్యగ్రహణం. కనుక గ్రహణ సమయం యొక్క వివరాలు, చేయాల్సినవి, చేయకూడనివి వంటి వివరాలు చూద్దాం. సూర్యాస్తమయానికి ముందు గ్రహణం మొదలు అవుతుంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి గ్రహణం పాక్షికంగా కనపడుతుంది.
సూర్య గ్రహణం అంటే ఏమిటి..?
సూర్యుని కాంతి నేరుగా భూమిని చేరకుండా మధ్యలో చంద్రుడు ఉంటాడు. దీనితో చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. ఇదే సూర్య గ్రహణం.
గ్రహణ సమయం వివరాలు:
అక్టోబర్ 25, సాయంత్రం 5.01 ని.లకు ప్రారంభమయి, 6.26 ని.లకు పూర్తి కానుంది. గ్రహణ పుణ్యకాలము 1.25 ని.లు. గంటసేపు సూర్య గ్రహణం ఉండనుంది.
గ్రహణాన్ని చూస్తే ఏమవుతుంది..?
గ్రహణం చూస్తే కంటికి నష్టం, అంధత్వాన్ని కలిగిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి.
సూర్య గ్రహణం సమయంలో ఎలాంటి పనులు చెయ్యాలి…?
గ్రహణం అప్పుడు శివుని మంత్రాలు జపిస్తే చాలా మంచిది. అలానే గ్రహణం అయ్యాక స్నానం తప్పక చెయ్యాలి.
గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకి వెళ్ళరాదు. ఇంట్లోనే ఉండాలి.
సూర్య గ్రహణం సమయంలో ఎలాంటి పనులు చెయ్యకూడదు…?
వంట చేయడం, తినడం అస్సలు చెయ్యకూడదు.
కళ్ళతో గ్రహణం చూడకూడదు. అలానే నిద్రపోకూడదు.
దర్భను సూర్యగ్రహణానికి ముందు ఆహారపదార్ధాల మీద వేసి ఉంచాలి.
గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. పదునైన వస్తువులను వాడడం వంటివి చెయ్యరాదు. అలానే బయటకు కూడా వెళ్ళకూడదు. గ్రహణం అప్పుడు శివుని మంత్రాలు జపించడం వంటివి చేస్తే మంచిది.