Breaking : పింగాణీ సింక్‌తో ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి ఎలాన్‌ మస్క్‌

-

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే.. గత కొన్ని నెలలుగా మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. శుక్రవారం నాటికి ట్విట్టర్‌ కొనుగోలు చేస్తానంటూ మరోసారి ట్విట్టర్‌ వేదిక ప్రకటించారు మస్క్‌. దీనికి మద్దతుగా మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఇందుకు సంబంధించి వీడియోను తన ట్విట్టర్ పేజీలో మస్క్ పోస్ట్ చేశారు మస్క్‌.

Elon Musk visiting Twitter headquarters this week ahead of expected deal  closing | CNN Business

పింగాణీ సింక్ ను రెండు చేతులతో పట్టుకుని మస్క్ ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలోకి అడుగులు వేశారు. అలా ఎందుకు చేశారన్నది తెలియదు. బహుశా అది ఆయనకు సెంటిమెంట్ అయి ఉండొచ్చు. అంతేకాదు, ట్విట్టర్ పేజీ తన ప్రొఫైల్ లో తనను చీఫ్ ట్విట్ గా సంబోధించుకున్నారు. దీన్నిబట్టి ట్విట్టర్ మస్క్ సొంతం అవుతుందని తెలుస్తోంది. 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి ట్విట్టర్ ను మస్క్ సొంతం చేసుకుంటున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.3.56 లక్షల కోట్లు. మరోవైపు ట్విట్టర్ మస్క్ సొంతం అయితే 75 శాతం మందిని తొలించనున్నట్టు వచ్చిన వార్తల్లో నిజంలేదని తెలుస్తోంది. 75 శాతం మందిని తొలగించే ప్రతిపాదన ఏదీ లేదని ట్విట్టర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన సందర్భంగా అక్కడి సిబ్బందితో మస్క్ చెప్పినట్టు బ్లూంబర్గ్ వెల్లడించింది. అయినా కానీ, ఎంతో కొంత మందికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news