ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వింత విచిత్ర విన్యాసం : విజయశాంతి

-

మెయిన్‌బాద్‌లోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అయితే, వీరిని రిమాండ్ కు ఇచ్చేందుకు ఏసీబీ కోర్టు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు విజయశాంతి టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వింత విచిత్ర విన్యాసం అని అన్నారు విజయశాంతి. ఈ కథలో కత్తి బీజేపీది కాదు, నెత్తి బీజేపీది కాదు… దొరికినోళ్లంతా టీఆర్ఎస్ వాళ్లేనని చెప్పారు విజయశాంతి. అయ్య (కేసీఆర్) చేసిన ప్రయోగాన్ని సమర్థించుకోలేక… దీనిపై టీఆర్ఎస్ వాళ్లు ఎవరూ మాట్లాడొద్దని కుమారుల వారు (కేటీఆర్) చెప్పారని విజయశాంతి ఎద్దేవా చేశారు విజయశాంతి.

Tollywood: Too many demands from Vijayashanti?

మాట్లాడిన కొద్దీ వారి మోసం ఎక్కువ బయటపడుతుందని అనుమానపడుతున్నారని చెప్పారు. పోలీసులు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నారని, ఏసీబీ కూడా వారి నియంత్రణలోనే ఉందని… దొరికిందన్న డబ్బుకు ఆధారాలు చూపించడం లేదని అన్నారు విజయశాంతి. న్యాయం కోసం హైకోర్టును బీజేపీ ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ అధ్వానపు ప్రయత్నంలో టీఆర్ఎస్ అడ్డంగా దొరికిపోయిందని తెలంగాణ ప్రజలు భావిస్తుండటం ప్రస్తుతం కొనసాగుతున్న పరిణామమని అన్నారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news