పాల్వాయి స్రవంతిపై దుష్ప్రచారం.. సీఎం కేసీఆర్ ఫైర్

-

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక విషయమై బీజేపీ దుష్ప్రచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తప్పు బట్టారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తనను వచ్చి కలిసి నట్లు దుష్ప్రచారం చేసిందని ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో గెలుపొటములు సహజం అని వ్యాఖ్యానించారు. తాము కూడా ఎన్నో ఎన్నికల్లో పోరాడామని, ఉద్యమాలు చేశామని చెప్పారు.

ఉపఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అంతా సక్రమంగా ఉన్నట్లు, లేకపోతే లేదన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. తాము నాగార్జున సాగర్‌, హుజూర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో గెలిచామన్నది గుర్తు తెచ్చుకోవాలని చెప్పారు. దుబ్బాక, హుజూరాబాద్‌ స్థానాల్లో ఓటమి పాలయ్యామని రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తెలిపారు. కానీ సంయమనం పాటించడం చాలా ముఖ్యమని హితవు పలికారు.

ఎన్నికల సంఘంపై బీజేపీ ఆరోపణలు సరైనవి కావని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సీఈవో విఫలమయ్యారని ఆరోపించడం బీజేపీ దిగజారుడు తనానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. ఈసీని నియమించేది కేంద్రమేనని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news