బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన సినిమా ‘బ్రహ్మస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘బ్రహ్మస్త్రం’ పేరుతో రాజమౌళి రిలీజ్ చేశాడు. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 9న రిలీజైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. చాలా కాలం తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఈ మూవీ కాసులు కురిపించింది. ఫ్లాప్‌లతో కొట్టుమిట్టాడుతున్న హిందీ సినిమా ఇండస్ట్రీకి కాస్త ఊరటను కల్పించింది. ఈ మూవీలో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించాడు. దాదాపు రూ.400 కోట్ల వరకు వసూళ్లు సాధించిన ఈ సినిమాను థియేటర్లో చూడని వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. థియేటర్లో చూసిన వారు కూడా మళ్లీ ఓ సారి చూడాలనుకుంటున్నారు.
బ్రహ్మాస్త్ర ఫ్యాన్స్‌కి ఓ గుడ్ న్యూస్. ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా గతరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు ప్యాన్ ఇండియా భాషలన్నింటిలో ఈ చిత్రం అందుబాటులో ఉంది. మైథలాజికల్ అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మూడు భాగాలుగా రూపొందనుంది. అందులో మొదటి భాగం ‘శివ’ పేరుతో రిలీజైంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.