పెళ్లి తర్వాత అలాంటి వాటికి గుడ్ బై చెప్పబోతున్న హన్సిక..!!

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి దేశముదురు సినిమాలో నటించిన హన్సిక తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన అందం, అభినయంతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది హన్సిక. అయితే హన్సిక ఇప్పటివరకు 50 సినిమాలలో పైగా నటించింది. ఇక ఈ తరుణంలో ఈమెకు అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో త్వరలో వివాహం చేసుకోవడానికి సిద్ధమైందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. వచ్చే నెలలో తన వివాహం చేసుకోబోతున్నట్లు హన్సిక తెలియజేయడం కూడా జరిగింది.

ఇక తన ప్రియుడు సోహెల్ ఈఫిల్ టవర్ ముందు తనకు ప్రపోజ్ చేస్తున్న ఒక ఫోటోని షేర్ చేస్తూ అందుకు తగ్గట్టుగా క్లారిటీ ఇచ్చింది. ఇక ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సోహెల్. ఇక వీరిద్దరూ స్నేహితులు మాత్రమే కాకుండా బిజినెస్ పార్టనర్ గా కూడా పలు ఈవెంట్లలో ఆర్గనైజేషన్ లో కూడా పెట్టుబడులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని దీంతో కొంతకాలం పాటు డేటింగ్ లో ఉన్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్ నగరంలో ఒక కోటలో నిర్వహించబోతున్నట్లు సమాచారం.

ఇదంతా ఇలా ఉండగా హన్సిక వివాహం తర్వాత నటనకు గుడ్ బై చెప్పబోతోందా అంటూ పలు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై హన్సిక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను వివాహమైన సరే సినిమాలకు గుడ్ బై చెప్పేదే లేదని అవకాశాలు వస్తే నటించేందుకు ఎప్పుడైనా సరే సిద్ధంగానే ఉన్నాను అంటూ తెలియజేసింది. హన్సిక చివరిసారిగా మహా సినిమాలో నటించింది. ప్రస్తుతం హన్సిక కు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news