BREAKING : రాజకీయ సన్యాసం తీసుకోనున్న కోమటిరెడ్డి ?

-

మునుగోడు ఉప ఎన్నికల్లో అందరూ అనుకున్నదే జరిగింది. అధికార టిఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. బిజెపి అభ్యర్థి అయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫై టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గ్రాండ్ విక్టరీ కొట్టాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో 10,307 ఓట్ల తేడాతో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అయితే మునుగోడులో బిజెపి పార్టీ ఓడిపోవడంతో… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు.

ఎన్నికల ప్రచారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మాట్లాడిన మాటలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. మునుగోడులో కేసీఆర్ పార్టీ విజయం సాధిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని… ఎన్నికలకు ముందు రాజగోపాల్ రెడ్డి శపధం చేశారు. అయితే దానికి సంబంధించిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అయితే రాజకీయ సన్యాసంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా స్పందించలేదు. కేవలం మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు చేసి వెళ్లిపోయారు రాజగోపాల్ రెడ్డి. తన రాజకీయ సన్యాసంపై రేపు లేదా మరో రెండు రోజుల తర్వాత ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news