మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేయడంపై అటవీ, పర్యావరణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు సీఎం కేసీఆర్ నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా నిలిచిందన్నారు ఇంద్రకరణ్‌రెడ్డి. గత కొంతకాలంగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు ప్రజలే ఓట్ల రూపంలో సమాధానం చెప్పారన్నారు ఇంద్రకరణ్‌రెడ్డి. ఎవరు ఎన్ని క్రుటుల, కుయుక్తులు పన్నినా ఎప్పటికీ ధర్మం గెలుస్తుందని మునుగోడు ప్రజలు నిరూపించారని పేర్కొన్నారు ఇంద్రకరణ్‌రెడ్డి. బీఆర్ఎస్ జాతీయ పార్టీ దేశవ్యాప్త జైత్రయాత్రకు మునుగోడు గెలుపు నాందికానుందన్నారు ఇంద్రకరణ్‌రెడ్డి.
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషించనుందని, ఈ దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలవనుందని స్పష్టం చేశారు ఇంద్రకరణ్‌రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదని, తెలంగాణలో ఉన్నది టీఆర్ఎస్ మాత్రమే అని మరోసారి స్పష్టమైందన్నారు. ఈ తీర్పుతో చైతన్యవంతులైన ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి నల్లొండ జిల్లా ప్రజల విజ్ఞత మరోసారి రుజువైందని చెప్పారు ఇంద్రకరణ్‌రెడ్డి. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన టీఆర్‌ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన ఆయన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ఇంద్రకరణ్‌రెడ్డి.