జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ విలువ రోజురోజుకు దిగజారు పోతోందని.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపణలు చేశారు. ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ 9 పార్టీలు మారాడని చురకలు అంటించారు.
చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ, సిపిఐ, బహుజన సమాజ్వాది పార్టీ అలాగే బిజెపి ఇంకా ఎన్నో పార్టీలో చేరడంతో పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్ నాశనమైపోయిందని ఆరోపణలు చేశారు. 2008 నుంచి పార్టీ పెట్టారే… కానీ ఈ సొంత సీటులో గెలవలేదని పవన్ కళ్యాణ్ ను ఏద్దేవా చేశారు.
ఆయన పార్టీని లీడ్ చేయడమేంటి ? పవన్ కళ్యాణ్ కు అమిత్ షా అపాయింట్మెంట్ అసలు లేనేలేదని చురకలంటించారు. వెంటనే పవన్ కళ్యాణ్ తమ పార్టీలో చేరాలని జయపాల్ పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేఏ పాల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి. ఇక కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేఏ పాల్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.