Breaking : గవర్నర్‌ తమిళిసైతో ముగిసిన మంత్రి సబితా భేటీ

-

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలంగాణ గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే.. గవర్నర్‌ తమిళిసై తో మంత్రి సబితాఇంద్రారెడ్డి భేటీ ముగిసింది. ఈ భేటీలో మంత్రితో పాటు అధికారులు పాల్గొన్నారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. యూజీసీ నిబంధనల అమలు, న్యాయపరమైన అంశాలు, రిజర్వేషన్లు వంటి వాటిపై గవర్నర్ వివరాలు అడిగారు. అన్ని నిబంధనలు పాటిస్తున్నామని మంత్రి, అధికారులు తెలిపారు. ప్రస్తుత విధానంలోని ఇబ్బందులు, కొత్త విధానంతో వచ్చే సౌలభ్యాన్ని.. గవర్నర్‌ దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. నియామకాలు త్వరగా జరిగేందుకు, సజావుగా సాగేందుకు చేపట్టాల్సిన అన్ని విషయాలపై గవర్నర్‌కు సబిత నివేదిక అందించారు. యూనివర్సిటీ ల బిల్లుపై సందేహాలు నివృత్తి చేసేందుకు సమయం ఇస్తే.. వచ్చి చర్చిస్తామని విద్యాశాఖ అధికారులు గవర్నర్‌ కార్యాలయాన్ని కోరారు.

ఈ మేరకు బుధవారం ఉదయం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ.. గవర్నర్‌ కార్యాలయ అధికారులతో ఫోన్‌ ద్వారా గవర్నర్‌ సమయాన్ని కోరారు. గవర్నర్‌ సమయం ఇస్తే.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తాను, ఇతర అధికారులు వచ్చి యూనివర్సిటీల నియామక బిల్లుపై చర్చిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రాజ్‌భవన్ నుంచి కబురు రావడంతో గురువారం సాయంత్రం గవర్నర్‌తో మంత్రి సబిత భేటీ అయ్యారు. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుపై సందేహాలు నివృత్తి చేయడానికి విద్యాశాఖ మంత్రి రావాలంటూ రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి గవర్నర్‌ లేఖ రాయడం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news