రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా?

-

ప్రేమ ఎక్కువైనప్పుడే గొడవలు కూడా వస్తాయన్న సంగతి తెలిసిందే..అయితే సర్దుకు పోవడంవల్ల జీవితం సాఫిగా సాగి పోతుంది..ఈ విషయాన్ని తప్పక గుర్తు పెట్టుకోవాలి.ఈ మధ్యలో ముఖ్యమైన శృంగారం కూడా సంతోషంగా, సంతృప్తిగా సాగిపోవాలన్నా కూడా చాలా విషయాలకు రాజీ పడిపోతూ కాస్త అవగాహనతో సాగిపోవడం అవసరం..గొడవలు రాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి..

  • ఒకరి మనసులను ఒకరు గౌరవించుకోండి. ఇద్దరూ రెండు భిన్నమైన మనస్సుల వారు అయితే ఆచరణాత్మకంగా ప్రతిదాని గురించి భిన్నంగా ఆలోచిస్తారు. చిన్న చిన్న పొరపొచ్చాలు వచ్చినా సర్దుకునే గుణం కావాలి.
  • కనెక్ట్ చేయడానికి డిస్‌కనెక్ట్ చేయండి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ సాధారణంగా ఒకరిపై ఒకరు ఒత్తిడిని కలిగిస్తాయి. గదిలో మీరిద్దరూ మాత్రమే ఉంటే కలిసి భోజనం చేయండి. ఇద్దరి మధ్యలో జరిగిపోయిన పాత విషయాలను గురతుంచుకున్న మధుర జ్ఞాపకాలను నెమరు వేసుకోండి.
  • సంబంధాన్ని పూర్తిగా పాడు చేసే వాటిలోఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం ఒకటి. వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు, ఆసక్తులు, లక్ష్యాలలో ఆకస్మిక మార్పు మోసానికి సంకేతం అని చాలా మంది నమ్ముతారు. అసలు మీరు ఉన్నది సరైన మార్గంలోనేనా అనేది గమనించుకోవాలి. మీ ఇద్దరి మధ్యా వచ్చిన మార్పుకు ఎవరు బాధ్యులో కూడా గమనించాలి. వీలైతే మార్పును సవరించే విధంగా ఆలోచించాలి. వ్యక్తిత్వంలో మార్పురావడానికి మధ్య మీ పాత్ర ఏమైనా ఉందేమో చూసుకోవాలి.
  • బాధ్యతలు పంచుకోండి..పొరపాట్లు దొల్లాయని తెలిసాకా సారీ చెప్పకుండా సాగదీయకండి. ఇంటి బాధ్యతలను కలిసి పంచుకోండి. మనసులో మాటలు నచ్చిన పని చేసి తెలియపరచండి. ఇది ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది..
  • లింగభేధం లేకుండా ఈగోలకు పోకుండా సారీ చెప్పేసుకుని పరిస్థితిని చక్కదిద్దుకుంటే సమస్యలు పెద్దవి కావు. ఇద్దరూ పట్టుగా ఉంటే దూరం పెరిగే అవకాశం ఉంటుంది..అంతేకాదు విడి పోవడం కూడా జరగొచ్చు..అంతే చిన్న నవ్వు పెద్ద జీవితాన్ని నడిపిస్తోంది అని గుర్తుంచుకోవాలి…

Read more RELATED
Recommended to you

Latest news