Weather Update : ఏపీకి భారీ వర్షసూచన.. హెచ్చరికలు జారీ

-

ఏపీని వరుసగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. మొన్నటి వరకు కురిసిన వర్షాలకే వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లు రోజుల తరబడి జలదిగ్బంధంలో చిక్కకున్నాయి. అయితే.. ఇప్పుడు తాజాగా.. మరోసారి ఏపీకి భారీ వర్ష సూచనలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని వివరించింది ఐఎండీ.

Telangana, AP to receive moderate rains in 48 hours

గరిష్ఠంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా, అల్పపీడనం క్రమేపీ పశ్చిమ వాయవ్య దిశగా తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా కేరళ వైపు పయనిస్తుందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంతాల్లోనూ, ఘాట్ ఏరియాల్లోనూ, కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వివరించింది. నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news