ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మరోసారి తీవ్ర విమర్శలు ఒప్పించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి రివర్స్ గేరులో వెళుతుందని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని హామీ ఇచ్చారు చంద్రబాబు. రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. ఈ విషయంలో నాకంటే చెప్పేవాడు కానీ, చేసేవాడు కానీ ఎవరూ లేరన్నారు.
ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రాంగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కర్నూలు యువతని కోరారు చంద్రబాబు. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం నుంచి పట్టభద్రుల కోట ఎన్నికలలో వైయస్ఆర్సీపీ తరఫున ప్రస్తుత ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి తనయుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, టిడిపి తరఫున భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ రెడ్డి ని గెలిపించాలని చంద్రబాబు కోరారు.