తీవ్ర ఒత్తిడి లో భారీ చిత్రాల డైరెక్టర్ శంకర్..!!

-

పాన్ ఇండియా దర్శకుడు శంకర్ రాంచరణ్ 15వ సినిమాను స్టార్ట్  చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాలని తపిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి అయ్యాయి.   ప్రస్తుతం మూడో షెడ్యూల్ నడుస్తోంది. శంకర్  ఇండియన్ 2 సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తి చేసి కొంత గ్యాప్ ఇచ్చి రెండో సినిమా చేస్తున్నాడు.

ఈ గ్యాప్ లోనే రామ్ చరణ్ జపాన్ టూర్, ఆఫ్రికా దేశాల సఫారీ టూర్ వేసుకొని వచ్చాడు. మళ్లీ షూటింగ్ కు రెడీ అయ్యి కసరత్తులు చేస్తున్నాడు. శంకర్  అందుకు తగ్గట్టుగానే రెండు సినిమాల షూటింగ్స్ ప్లాన్ చేసాడట. వాస్తవానికి శంకర్ ఏనాడూ రెండు సినిమాలు ఒకే సారి షూటింగ్ చేసింది లేదు. తాను ఒక ప్రోజెక్ట్ మీద దృష్టి పెడితే దాన్ని కంప్లీట్ చేసేదాకా వేరేది ముట్టు కొనే వాడు కాదు.

కాని ప్రస్తుతం రెండు సినిమాల వల్ల శంకర్ స్ట్రెస్ గురి అవుతున్నారు అని తమిళ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇండియన్ 2 సినిమా త్వరగా పూర్తి చేయాలని కమల్ హాసన్ మరియు నిర్మాతలు ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. కాని శంకర్ మాత్రం ఏమాత్రం క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడకుండా తీసే రకం.కానీ ఇప్పుడు రెండు సినిమాలను ఒకేసారి పూర్తి చేస్తా అని తలకు మించిన భారం ఎత్తుకున్నాడని కోలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news