రయ్‌.. రయ్‌.. నేడు, రేపు ఇండియన్‌ రేసింగ్‌ లీగ్..

-

హైదరాబాద్ వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్ నేడు ప్రారంభం కానుంది. నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్ ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఆదివారం కూడా ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఇందుకోసం హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ తీరాన నూతనంగా రూపొందించిన స్ట్రీట్‌ సర్క్యూట్‌పై ఫార్ములా రేసింగ్‌ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది. శనివారం అట్టహాసంగా ప్రారంభమవుతున్న ఈ పోటీలను రేసింగ్‌ ప్రమోషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ.. అంతర్జాతీయ ఆటోమొబైల్‌ ఫెడరేషన్‌ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఈ ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)ను నిర్వహిస్తోంది.

formula e racing in hyderabad, Indian Racing League: హైదరాబాద్‌లో 'ఫార్ములా  ఈ రేసింగ్' ప్రారంభ ఎడిషన్‌కు టికెట్లు విడుదల - tickets for india's first  ever street circuit race to be held at ...

ఐఆర్‌ఎల్‌ పోటీలు ఫార్ములా రేసింగ్‌లోని ఎఫ్‌-3 స్థాయివి. ఇందులో హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ సహా ఆరు జట్లు తలపడుతున్నాయి. ఒక్కో జట్టు తరఫున ముగ్గురు పురుష, ఒక మహిళా డ్రైవర్‌ పోటీ పడనున్నారు. మొత్తం ఆరు జట్ల నుంచి 12 కార్లు, 24 మంది డ్రైవర్లు బరిలో ఉంటారు. హైదరాబాద్‌ టీమ్‌ నుంచి నగరానికి చెందిన ప్రముఖ ఫార్ములా డ్రైవర్‌ కొండా అనిందిత్‌ రెడ్డి బరిలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news