ఉద్యోగులకు అదిరిపోయే న్యూస్‌.. EPFO కీలక నిర్ణయం

-

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు అదరిపోయే వార్త చెప్పింది. పెన్షన్ పథకానికి సంబంధించి ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితి(సీలింగ్)ని పెంచాలని EPFO నిర్ణయించినట్టు తెలుస్తోంది. అదే జరిగితే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగుల చేతికి అందే మొత్తం భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం రూ. 15వేలుగా ఉన్న ఈ పరిమితిని రూ. 21 వేలకు సవరించాలని యోచిస్తోంది EPFO. అప్పుడు ఉద్యోగులు, యజమానులు చెల్లించే వాటా కూడా పెరుగుతుంది EPFO. ఫలితంగా ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాకు జమయ్యే మొత్తం కూడా పెరుగుతుంది.

EPFO: Your benefits related to PF money – know the important rules of EPFO  - Business League

ఇద్దరి వాటాలకు వడ్డీ వర్తిస్తుంది కాబట్టి ఉద్యోగులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని కేంద్రం చివరిసారి 2014లో సవరించింది. అప్పట్లో రూ. 6,500గా ఉన్న పరిమితిని రూ. 15 వేలకు పెంచారు. అయితే, 20 మంది అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సంస్థలకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. 8 సంవత్సరాల తర్వాత పరిమితిని పెంచాలని భావిస్తున్న కేంద్రం ఇందుకోసం ఓ కమిటీని నియమించే అవకాశం ఉంది. అలాగే, తాజా నిర్ణయంతో దాదాపు 75 లక్షల మంది పీఎఫ్‌వో పరిధిలోకి వస్తారని అంచనా.

Read more RELATED
Recommended to you

Latest news