ఒకే ఫోన్లో రెండు సిమ్ కార్డులు పని చెయ్యావా?ఎందుకంటే?

-

స్మార్ట్ యుగం నడుస్తోంది.. టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది వీటి వినియోగం కూడా భారీగా పెరుగుతూ వస్తుంది..ఒక ఫోన్లో రెండు సిమ్ కార్డులను వాడుకొనే సదుపాయం కూడా ఉండటంతో సిమ్ ల వాడకం కూడా పెరిగింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లలోనూ డ్యూయల్ సిమ్ సిస్టమ్ అందుబాటులో ఉండడంతో వినియోగదారులు తమకు నచ్చిన కంపెనీ సిమ్లను ఎంచుకుంటున్నారు.నెట్వర్క్ బాగున్న సిమ్కు మొదటి ప్రాధాన్యత ఇస్తూ.. మిగతా కంపెనీ సిమ్లను సెకండరీ ఆప్షన్లా ఉంచుకుంటున్నారు..

అయితే, ఇక మీద ఒకే ఫోన్లో రెండు సిమ్ కార్డుల ట్రెండ్కు శుభం కార్డు పడబోతోందా.. అన్న ప్రశ్నకు అవును అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.ఒకప్పుడు రెండో సిమ్ యాక్టివ్లో ఉండేందుకు ఎలాంటి రీచార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉండేది. అయితే తర్వాత ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాను రాను టెలికాం కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా కనీస రీచార్జ్ నిబంధనను విధించాయి. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్, డిసెంబర్లో టెలికాం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్ ధరలను ఒక్కసారిగా పెంచేశాయి.

ఎయిర్‌టెల్ కనీస రీచార్జ్ రూ.79ని గత ఏడాది రూ.99కి పెంచింది. తర్వాత ఎయిర్‌టెల్ పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద కొన్ని సర్కిళ్లలో తమ ప్రీపెయిడ్‌ బేస్‌ టారిఫ్‌ను రూ.99 నుంచి రూ.155 కి పెంచింది..ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.5G సేవలు ప్రారంభించిన తర్వాత అన్ని టెలికాం కంపెనీలు తమ రీచార్జ్ ప్లాన్‌లను మరింతగా పెంచేశాయి. దీంతో రెండు సిమ్‌లను వాడడం.. వినియోగదారులకు కూడా పెద్ద సమస్యగా మారింది.

ప్రస్తుతం దాదాపు అన్ని అన్ని టెలికాం కంపెనీలు ఒకే రకమైన రీఛార్జ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో చాలా మంది వినియోగదారులు ఒకే సిమ్‌ను వాడేందుకే మొగ్గుచూపుతున్నారు..దాదాపు 70 లక్షల మందిని కొల్పొనుందని తెలుస్తుంది.సెకండరీ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో.. త్వరలో ఈ డ్యూయల్ సిమ్ ట్రెండ్‌కు ముగింపు పడనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఫోన్లో రెండు సిమ్ కార్డులు పని చెయ్యవు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news