దీప్తిని మరచి పోలేక విరక్తి చెందుతున్న షణ్ముక్ జశ్వంత్.!

-

షణ్ముక్ జశ్వంత్ అంటే సోషల్ మీడియాలో పరిచయం లేని వారు ఏవరూ ఉండరు. తనకు సోషల్ మీడియాలో ప్లాట్ ఫామ్ లో విపరీతమైన క్రేజ్ వుంది. ఈ క్రేజ్ చూసి బిగ్ బాస్ షో వారు ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ 5వ సీజన్ కు తీసుకొని వచ్చారు. అప్పటికే షన్ను తన కో స్టార్ అయిన దీప్తి సునయన తో ప్రేమలో మునిగి తేలుతున్నాడు. తన ఎంకరేజ్ తో అతను బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు.

ఇక అక్కడకి వెళ్ళిన తర్వాత, అక్కడ మరో హౌస్ మేట్ అయిన సిరి తో పులిహోర కలపడం స్టార్ట్ చేసాడు. ఇక వీరు హద్దులు దాటి హగ్గులు, పెదవి ముద్దులు వరకు వెళ్ళిపోయారు. అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో హంగామా గా మారింది. దీప్తి సునయన తో మంచి ప్రేమ రిలేషన్ ఉన్నప్పటికీ కూడా అతడు మర్చిపోయి దొరికింది కదా అని బిగ్ బాస్ హౌస్ లో రెచ్చిపోయాడు. దీన్ని చూసి దీప్తి చీ కొట్టి విడిపోయింది. సిరి బాయ్ ఫ్రెండ్ శ్రిహన్ మాత్రం ఆమెను క్షమించాడు. ఇక షన్ను కూడా ఏదో బలహీన క్షణంలో జరిగింది అన్నా కూడా ఆమె కనికరించలేదు.

వాస్తవానికి దీప్తి తనకు చాలా హెల్ప్ చేసింది. అందుకే అతను ఆమెను మరచి పోలేక పోతున్నాడు.అయితే రీసెంట్ గా షన్ను ఒక డాన్స్ వీడియో  పెట్టాడు.అయితే అందులో తను డాన్స్ చేస్తుండగా తన షూ లేస్ ఊడిపోవడంతో అది గమనించిన ఓ నెటిజన్ లేస్ ఊడిపోయాయి అంటూ తెలిపాడు. దానికి షన్ను.. జీవితంలో చాలా ఊడిపోయాయి.. లేసులో ఏముందిలే తమ్ముడు అంటూ విరక్తి గా అన్నాడు. దీన్ని బట్టి అతను దీప్తి ని అస్సలు మరచి పోవడం లేదని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news