ఎమ్మె్ల్యేల ఎర కేసు.. తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్‌ పిటిషన్‌

-

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో కీలక నిందితుడు జగ్గు స్వామి తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేరళలో ఉంటున్న జగ్గు స్వామిపై సిట్ వేట మొదలుపెట్టడంతో.. అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జగ్గు స్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ నోటీసులు, లుకౌట్ నోటీసులపై స్టే ఇవ్వాలని జగ్గు స్వామి క్వాష్ పిటిషన్ వేశారు. జగ్గు స్వామి పిటిషన్ హైకోర్టులో సోమవారం విచారణకు వచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతితో కేరళ వైద్యుడు కొట్టిలిల్‌ నారాయణ జగ్గు అలియాస్‌ జగ్గు స్వామి ఫోన్‌ సంభాషణలు రికార్డయ్యాయి.

Mlas Purchase case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ వేగం

రామచంద్రభారతి తన ఫోన్‌లో జగ్గు స్వామికి ‘విటమిన్‌ సీ’ సిద్ధం చేయాలని సందేశం పంపినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాల మేరకు.. జగ్గు స్వామిని విచారించేందుకు సిట్‌ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ బృందం కేరళకు వెళ్లగా.. ఆయన అమృత ఆసుపత్రి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. దీంతో సిట్‌ అధికారులు సాక్ష్యులైన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్‌ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్‌ లకు 41–ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news