శ్రీకాళహస్తిలో చొక్కాని ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. దీపోత్సవంలో మంటలు ఎగిసి పడటంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి, పలువురికి గాయాలయ్యాయి. ఈ తోపులాటలో ముగ్గురు ఆలయ సిబ్బంది, ఐదుగురు భక్తులు గాయపడ్డారు. ఓ మహిళా సెక్యూరిటీ గార్డుకు చెయ్యి విరిగింది. గాయపడ్డ వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సాధారణంగా ఏటా పౌర్ణమి నాడు శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో చొక్కాని ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా భారీ దీపోత్సవం ఏర్పాటు చేస్తారు. ఈ ఆలయ పరిసరాల్లోనే దాదాపు ఒక 20 అడుగుల ఎత్తులో ఒక దీపాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ సెక్యూరిటీ, ఇతర సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోకుండా దీపోత్సవం నిర్వహించారు.
దీంతోనే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. ప్రతి ఏటా ఈ దీపోత్సవానికి వందలాది మంది భక్తులు హాజరవుతూనే ఉంటారు. అయితే గత రెండేన్నరేళ్లుగా కరోనా కారణంగా భక్తులు దూరంగా ఉన్నారు. అందుకే ఈ సారి ఊహించని రీతలో భారీగానే భక్తులు వచ్చారు. దానిక తగ్గ ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వహాకులు ఫెయిలయ్యారు. అందుకే భారీగా మంటలు ఎగిసిపడతాయని తెలిసినా.. భక్తులను కంట్రోల్ చేయడంలో సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. ఒక్కసారి మంటలు ఎగిసిపడడంతో.. భయపడ్డ భక్తులు భయపడి ఒక్కసారిగా పరుగు అందుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆమెను వీల్ చైర్ లో శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.