కాషాయ కోటని కూల్చిన కేజ్రీవాల్..ఆప్ హవా షురూ.!

-

దేశంలో మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో బీజేపీ-కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం వచ్చింది. మొదట ఢిల్లీలో ఆప్ హవా మొదలైంది. దశాబ్దాలుగా ఢిల్లీని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీని కూలగొట్టి బీజేపీతో జట్టు కట్టి ఢిల్లీ గద్దెనెక్కింది. కానీ మధ్యలో బీజేపీ హ్యాండ్ ఇవ్వడంతో కేజ్రీవాల్..రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో సొంతంగానే ఆప్ అధికారంలోకి రావడం, కేజ్రీవాల్ సీఎం అవ్వడం జరిగాయి. మరోసారి కూడా అదే తరహాలో విజయం సాధించి ఢిల్లీ గద్దెనెక్కారు.

అయితే ఢిల్లీలో ఆప్ హవా ఆగలేదు. నిదానంగా ఇతర రాష్ట్రాలపై ఆప్ ఫోకస్ పెట్టింది. ఇదే క్రమంలో పంజాబ్‌లో ఆప్ పాగా వేసింది. అక్కడ కూడా కాంగ్రెస్‌కు చెక్ పెట్టడం, బీజేపీని నిలువరించడం చేసింది. ఇప్పుడ్ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో సైతం ఆప్ తన సత్తా చాటేలా ఉంది. ఇక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయనే ఒక్కరోజు ముందు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఆప్ ప్రభంజనం సృష్టించింది. ఇంతకాలం బీజేపీ చేతుల్లో ఉన్న కార్పొరేషన్‌ని ఆప్ సొంతం చేసుకుంది.

గత 15 ఏళ్లుగా ఢిల్లీ కార్పొరేషన్ పీఠం బీజేపీ చేతుల్లోనే ఉంది. చివరిగా 2017 ఎన్నికల్లో 250 వార్డులు ఉన్న ఢిల్లీ కార్పొరేషన్‌లో బీజేపీ 181, ఆప్     48, కాంగ్రెస్ 27 వార్డులని గెలుచుకుంది. ఇక తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదలవ్వగా..అందులో ఆప్ 134 స్థానాలని గెలుచుకుంది..అంటే మ్యాజిక్ ఫిగర్ 126 దాటి ఢిల్లీ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకుంది.

బీజేపీకి 104 వార్డులు వచ్చాయి. కాంగ్రెస్ కేవలం 9 వార్డుల్లో గెలిచింది. ఇతరులు 3 వార్డుల్లో గెలిచారు. ఇలా కాషాయ పార్టీ కంచుకోటగా ఉన్న ఢిల్లీ కార్పొరేషన్‌ని సైతం కేజ్రీవాల్ కూల్చారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందని, కేజ్రీవాల్ ప్రభుత్వం స్కామ్‌కు పాల్పడిందని ఆరోపణలు, ఈడీ, సి‌బి‌ఐ దాడులు జరుగుతున్న నేపథ్యంలోనే ఢిల్లీ ప్రజలు ఆప్‌కు పట్టం కట్టడం విశేషం. ఇక ఇక్కడ నుంచి దేశంలో ఆప్ హవా మరింత పెరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news