ఐఆర్‌సీటీసీ నుండి కొత్త టూర్.. సింగపూర్‌, మలేషియా ని తక్కువ ధరకే చూసొచ్చేయచ్చు..!

-

ఐఆర్‌సీటీసీ టూరిజం ఇప్పటికే చాలా రకాల ప్యాకేజీలని అందిస్తోంది. ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం తాజాగా విదేశీ ప్యాకేజీలను తీసుకు వచ్చింది. ఎప్పటికప్పుడు సీజన్‌కు తగ్గట్టు సరికొత్త టూర్ ప్లాన్స్ ని IRCTC తీసుకు వచ్చింది. అయితే చాలా మందికి విదేశాలకి వెళ్లాలని ఉంటుంది. విదేశాలకి వెళ్లాలని అనుకునే వాళ్ళు IRCTC తీసుకు వచ్చిన ప్యాకేజీ ని చూడండి.

మరి ఇక ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజీ వివరాలని చూద్దాం. సింగపూర్, మలేషియా, ఆగ్నేయాసియా దేశాలను ఈ ప్యాకేజీ లో భాగంగా చూడచ్చు. ఈ దేశాలను మీరు తక్కువ ఖర్చుతో చూసి వచ్చేయచ్చు. సింగపూర్ ని కూడా చూడాలని చాలా మంది చూస్తూ వుంటారు. మీకూ ఈ ప్రదేశాలకి వెళ్లాలని ఉంటే ఈ ప్యాకేజీ వివరాలని చూసేయచ్చు. జనవరి 18న ఈ టూర్ మొదలవుతుంది.

తక్కువ ధరతో సింగపూర్‌ టూర్ ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఈ టూర్ కోసం 32 మందికి మాత్రమే అవకాశం వుంది. రెండు విడతలుగా ఈ టూర్ ఉంటుంది. రెండో పర్యటన జనవరి 24న ఉంటుంది. ఢిల్లీ ఎయిర్ ఫోర్ట్ నుంచి ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి టూరిస్ట్‌లు సింగపూర్‌ లోని మలిండో ఎయిర్ పోర్ట్‌ కి చేరుకుంటారు. ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న ఒరిజినల్ పాస్‌పోర్ట్ పక్కా ఉండాలి. వీసా ఫామ్ 14Aను నింపి సంతకం చేసి ఇవ్వాలి. బ్యాంక్ స్టేట్‌మెంట్, పాస్‌పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కాపీ ఇలా కొన్ని ప్రూఫ్స్ కావాలి. https://www.irctctourism.com/ ద్వారా సంప్రదించచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news