తెలుగులో నెంబర్ వన్ సెలబ్రిటీ టాక్ షో గా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక షో అన్ స్టాపబుల్.. బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ఈ కార్యక్రమం ఇప్పటికే మొదటి సీజన్ పూర్తిచేసుకుని .. రెండవ సీజన్ ని కూడా మొదలు పెట్టింది. తాజాగా ఈ సీజన్ ఉత్కంఠ భరితంగా సాగుతుందని చెప్పాలి. రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా వచ్చి ఎన్నో విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం రెబల్ స్టార్ ప్రభాస్, ఆయన ప్రాణ స్నేహితుడు గోపీచంద్ కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలు , గ్లింప్స్ కూడా వైరల్ గా మారాయి.
ఈ ఎపిసోడ్ ఇంకా విడుదల చేయకనే వచ్చే ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అసలు విషయంలోకి వెళితే రెండవ సీజన్ రెండవ ఎపిసోడ్లో యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్సేన్, సూర్యదేవర నాగవంశీతో జరిగిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణలో.. ఈ షోకి ఎప్పుడు వస్తావు..? అని త్రివిక్రమ్ ను బాలకృష్ణ అడగగా.. మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తానని త్రివిక్రమ్ సమాధానం తెలిపాడు.
వెంటనే బాలయ్య..” ఎవరితో రావాలో తెలుసుగా?” అని అడిగారు. నిజానికి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేసే ప్రతి పనిలో కూడా త్రివిక్రమ్ పరోక్షంగా నిలబడతాడు. అందుకే ఇప్పుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో బాలయ్య షో కి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను గెస్ట్ గా రమ్మని ఆహ నిర్వాహకులు అడగగా పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఇంటర్వ్యూలో సినిమాలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చించబోతున్నారు.