అన్నపూర్ణ స్టూడియోలో పవన్ కళ్యాణ్,బాలయ్య

-

గత కొన్ని రోజుల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..  బాలయ్య అన్ స్టాపబుల్ షో కు వస్తారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో వారిద్దరు అన్నపూర్ణ స్టూడియోలో వీరు సమావేశం అయ్యారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ నేపథ్యంలో వీరిద్దరూ కలిసి 20 నిమిషాల పాటు ముచ్చటించారు.

అయితే, ఇవాళ మరోసారి వీరిద్దరూ అన్నపూర్ణ స్టూడియోలో సమావేశం అయ్యారు. అన్ స్టాపబుల్ షో కోసం వీరిద్దరూ అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చినట్లు సమాచారం అందుతోంది. తాజాగా వీరిద్దరూ అన్నపూర్ణ స్టూడియో కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటే ఇవాళ ఈ షోకు సంబంధించిన షూటింగ్ జరగనుంది అన్నమాట. కాగా ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఈనెల 30వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news