వరంగల్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్‌ లో వున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. వరంగల్‌ లో వున్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లో మొత్తం వంద పోస్టులు ఖాళీగా వున్నాయి.

jobs
jobs

ఇక పోస్టుల వివరాలని చూస్తే.. ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక అర్హత వివరాలని చూస్తే… బీఏ/ బీఎస్సీ/ బీకామ్‌/ బీటెక్‌/ బీఈ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్‌/ ఎంఎస్సీ/ పీజీ/ ఎంఏ/ పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో అరవై శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళ వయస్సు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి జవనరి 25, 2023 చివరి తేదీ. కనుక ఈలోగా అప్లై చేసుకోవడం మంచిది. అప్లికేషన్ ఫీజు కింద రూ.1000లు చెల్లించాల్సి వుంది. ఎస్సీ/ఎస్టీ ఇతర కేటగిరీ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద కట్టాల్సి వుంది. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే
షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలని మీరు https://nitw.ac.in/page/?url=/advt.no.03/2022 లో చూసి అప్లై చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news