LIC కొత్త ప్లాన్.. రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్..!

-

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసీ న్యూ జీవన్ అమర్ ప్లాన్, ఎల్ఐసీ న్యూ టెక్ టర్మ్ ప్లాన్ ని తీసుకు వచ్చింది. ఈ ప్లాన్స్ వలన చక్కటి లాభాలను పొందొచ్చు. పైగా కేవలం రూ.6,000 లోపు ప్రీమియంతో రూ.50 లక్షల ఇన్స్యూరెన్స్ పాలసీ ని తీసుకోవడానికి అవుతుంది. పూర్తి వివరాలని చూస్తే.. టర్మ్ ఇన్స్యూరెన్స్ ని తీసుకోవాలంటే ఇది మంచి ఆప్షన్.

తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ ని పొందొచ్చు. న్యూ జీవన్ అమర్ ప్లాన్ గురించి చూస్తే.. దీని వలన చక్కటి లాభాలని పొందేందుకు అవుతుంది. ప్యూర్ రిస్క్ ప్రీమియం లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ ఇది. పైగా నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్ ప్లాన్. ఒకవేళ కనుక పాలసీ కొనసాగుతున్న సమయంలో మరణిస్తే కుటుంబానికి ఆర్ధిక సహాయం ఇస్తారు.

18 నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న వున్నవాళ్లు ఈ ప్లాన్ ని తీసుకోవచ్చు. మెచ్యూరిటీ వయస్సు 80 ఏళ్ల లోపే. ఈ ప్లాన్ కనీస సమ్ అష్యూర్డ్ రూ.25,00,000. గరిష్టంగా ఎంత మొత్తానికైనా దీన్ని పొందొచ్చు. 10 నుంచి 40 ఏళ్ల మధ్య ఈ పాలసీ టర్మ్ ఉంటుంది. రెగ్యులర్ ప్రీమియం, లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్స్ దీనిలో వున్నాయి. 20 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి మొదటి ఆప్షన్ ని కనుక ఎంచుకుంటే 20 ఏళ్ల పాలసీ టర్మ్‌తో రూ.50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుంటే… రెగ్యులర్ ప్రీమియం ఏడాదికి రూ.5,959 + జీఎస్‌టీ చెల్లించాలి.

రూ.57,768 + జీఎస్‌టీ కింద సింగిల్ ప్రీమియం ని చెల్లించాలి. 20 ఏళ్ల పాటు రూ.50 లక్షల కవరేజీ వస్తుంది. ఆప్షన్ 2 ఎంచుకున్నవారికి అయితే సమ్ అష్యూర్డ్ పెరుగుతూ ఉంటుంది. రూ.7,832 + జీఎస్‌టీ ప్రీమియం చెల్లించాలి. సింగిల్ ప్రీమియం అయితే రూ.1,14,187 + జీఎస్‌టీ చెల్లించాలి ఐదేళ్లు అయ్యాక ప్రతీ ఏటా 10 శాతం చొప్పున సమ్ అష్యూర్డ్ పెరుగుతూ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news