ట్విట్టర్‌ ఇజ్జత్‌ తీస్తున్న ఎలాన్‌.. హెడ్‌ ఆఫీస్‌ రెంట్‌ కట్టలేదట

-

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సంస్థ ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్‌ హస్తగతం చేసుకున్ననాటి నుంచి చిక్కుల్లోనే నడుస్తుందని చెప్పాలి. ఇటు ఉద్యోగులను తీసివేస్తూ.. మరో వైపు ఎప్పుడులేనివిధంగా ట్విట్టర్‌ డౌన్‌ అవడం అంతా ట్విట్టర్‌పై భారంపడుతోంది. అయితే.. తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా.. ఆఫీసు అద్దె కట్టట్లేదంటూ ఆ కంపెనీపై అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కొలంబియా రెయిత్ కంపెనీ ట్విట్టర్ పై కోర్టు కెక్కింది. ట్విట్టర్ కంపెనీ 1.36 లక్షల డాలర్ల అద్దె బకాయిపడిందని ఆరోపిస్తోంది. ట్విట్టర్ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలోని హార్ట్ ఫోర్డ్ బిల్డింగ్ లో 30 వ అంతస్థులో ఉంది. ఈ బిల్డింగ్ సొంతదారు కొలంబియా రెయిత్ నుంచి ట్విట్టర్ అద్దెకు తీసుకుంది.

Twitter seeks subtenants for its SF HQ, as its own employees stay home

అయితే, ఇటీవల కొన్ని వారాల నుంచి ట్విట్టర్ అద్దె చెల్లించట్లేదని కొలంబియా రెయిత్ ఆరోపించింది. దీనిపై గత నెల 16న ట్విట్టర్ కు నోటీసులు కూడా ఇచ్చినట్లు పేర్కొంది. అయినా కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో ట్విట్టర్ పై కోర్టులో దావా వేసినట్లు ఓ ప్రకటనలో వివరించింది. కాగా, శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రధాన కార్యాలయంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో ఉన్న కార్యాలయాలకు సంబంధించిన అద్దె కూడా ట్విట్టర్ చెల్లించడంలేదని సమాచారం. దీనిపై పలు మీడియా సంస్థలు ట్విట్టర్ ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆ కంపెనీ స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news