టీడీపీ అంతర్గత సర్వే..మ్యాజిక్ ఫిగర్ దాటలేదు.!

-

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు గెలుపు కోసం పోరాడుతున్నాయి. మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలని వైసీపీ..ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చెప్పి టీడీపీ చూస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రతి నియోజకవర్గంలో బలపడటమే లక్ష్యంగా రెండు పార్టీలు ముందుకెళుతున్నాయి. అయితే రెండు పార్టీలు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తూ..తమ పార్టీల బలాబలాలని అంచనా వేసుకుంటున్నారు.

ఇదే క్రమంలో తాజాగా టీడీపీలో ఓ అంతర్గత సర్వే ఒకటి బయటకొచ్చింది. ఇది పార్టీ వర్గాల నుంచి అంతర్గతంగా అందిన సర్వే అని తెలుస్తుంది. ఈ సర్వే ప్రకారం టీడీపీ సింగిల్ గా పోటీ చేస్తే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు దాటే అవకాశం ఏ మాత్రం లేదని తెలుస్తోంది. ఆ సర్వే ప్రకారం చూసుకుంటే టీడీపీ 70-75 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తేలిందట. అంటే మ్యాజిక్ ఫిగర్‌కు 13-18 సీట్లు వెంకబడింది.

ఇక ఉమ్మడి జిల్లాల వారీగా టీడీపీ సర్వే లెక్కలు చూసుకుంటే..శ్రీకాకుళంలో 10 సీట్లు ఉంటే టీడీపీ 4-5 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందట. విజయనగరంలో 9 సీట్లు ఉండగా, టీడీపీకి 4, విశాఖలో 15 సీట్లు ఉండగా టీడీపీ-8, తూర్పు గోదావరిలో 19 సీట్లు ఉండగా టీడీపీ-9, పశ్చిమ గోదావరిలో 15కి టీడీపీకి 8 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందట. కృష్ణాలో 16 సీట్లకు..టీడీపీకి 9.. గుంటూరులో 17 ఉండగా, టీడీపీకి 10 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందట.

ప్రకాశంలో 12కి 6, నెల్లూరులో 10 సీట్లకు 3, కడపలో 10 సీట్లకు 2, చిత్తూరులో 14కు 4-5, కర్నూలులో 14కు..4-5, అనంతపురంలో 14 సీట్లకు 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తేలింది. అంటే మొత్తం మీద 70-75 సీట్లు మాత్రమే గెలుచుకునే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది. అయితే ఇది ఇప్పుడున్న పరిస్తితుల్లో నెక్స్ట్ ఎన్నికల సమయానికి పరిస్తితి మారవచ్చు..జనసేనతో పొత్తు ఉంటే ఇంకా ఫలితాలు మారతాయని టీడీపీ అంచనా వేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news