బాస్ పార్టీ ఇస్తే మామూలుగా ఉండదు! అదిరిపోద్ది.!

-

బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’  చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా  ఈ సినిమా 13  రిలీజ్ ని అనౌన్స్ చేశారు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యారు.

ఈప్రమోషన్స్ కూడా సూపర్ ల్లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట. వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన బాస్ పార్టీ, చిరంజీవి శ్రీదేవీ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్ గా వీరయ్య టైటిల్ సాంగ్ కూడా వ్యూస్ కొల్లగొడుతోంది.అయితే తాజాగా వాల్తేరు వీరయ్య టీం కున్యూ ఇయర్ సందర్భంగా  చిరంజీవి మంచి పార్టీ ఇచ్చారు.

చిరు పార్టీకి దాదాపు టీమ్ అంతా వచ్చి సందడి చేశారు. డైరెక్టర్ బాబీతోపాటు మాస్ మహారాజ్ రవితేజ, నిర్మాతలు రవిశంకర్‌, నవీన్ యేర్నేని, శేఖర్‌ మాస్టర్‌, రామ్-లక్ష్మణ్‌, వంటి ప్రముఖులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు మెగాస్టార్ .. వాల్తేరు వీరయ్య టీం కోసం పార్టీ ఇక్కడ.. అంటూ పార్టీ లో ఉన్నపుడు ఫుల్ ఆన్ లో ఉంది.. టీంతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు. ఇది నెట్టింట్లో సందడి చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news