వామ్మో: తమన్నా ఆస్తుల విలువ అన్ని వందల కోట్లా..?

-

2007లో హ్యాపీడేస్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా అంతకంటే ముందు శ్రీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. 17 సంవత్సరాల ఆమె కెరియర్ లో ఎక్కడ డౌన్ ఫాల్ లేకుండా.. ఎప్పటికప్పుడు తన స్థానంలో తాను కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమె వయసు 33 సంవత్సరాలు అయినా.. చెక్కుచెదరని అందం ఆమె సొంతం.. కేవలం సినిమాలతోనే కాదు ఫాంటా , సెల్కాన్ వంటి పలు బ్రాండ్ లకి , అలాగే శారీ షో రూమ్ లోకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది అంతేకాదు జువెలరీ బ్రాండ్ లకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోందని సమాచారం.

ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఆమె వార్షిక ఆదాయం రూ. 12 కోట్లు ఉంటుందని.. అంటే సగటు నెలకు కోటి రూపాయల సంపాదనని సమాచారం.ఒక్కో సినిమా ద్వారా పారితోషకం రూ.5 కోట్లకు పైగా రెమ్యునరేషన్ లభిస్తుందని తెలుస్తోంది. ఒక్కో ఐటెం సాంగ్ కి భారీ స్థాయిలో తీసుకుంటున్నట్లు తెలుస్తోందిఅంతేకాదు ఐపీఎల్ ప్రారంభోత్సవం వేడుకల్లో 10 నిమిషాల పాటు నర్తించడానికి రూ.50 లక్షలు సొంతం చేసుకుంది. 2015లో వైట్ అండ్ గోల్డ్ పేరిట ఒక జువెలరీ బ్రాండ్ కూడా స్థాపించింది. అంతేకాదు ఉపాసన ఇచ్చిన రూ.2 కోట్ల విలువైన అరుదైన వజ్రం కూడా ఈమె దగ్గర ఉంది. ఇది ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద డైమండ్ అని వినికిడి.

అంతేకాదు తమన్నా కి ముంబైలోని వెర్సోవా లో రూ.16 కోట్ల విలువ చేసే లగ్జరీ ఫ్లాట్, ల్యాండ్ రోవర్ , డిస్కవరీ, బిఎండబ్ల్యూ ఫైవ్ సిరీస్, బెంజ్ కార్లు కూడా ఉన్నాయి. ఆమె వాడే చానల్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ.3,00, 000.ఇలా మొత్తంగా ఈమె దగ్గర రూ.150 కోట్ల రూపాయలకంటే ఎక్కువగానే ప్రాపర్టీ ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news