ఏపీ పాడి రైతులకు శుభవార్త. కర్నూలు మిల్క్ యూనియన్ తమకు పాలు పోసే రైతులకు రూ.7.20 కోట్ల బోనస్ అందించింది. తాడేపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ మొత్తాన్ని పంపిణీ చేశారు.
తమ యూనియన్ రెండేళ్లలో రూ. 27 కోట్ల లాభాలు గడించిందని చైర్మన్ ఎస్ వి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే రోజుల్లో డేయిరీ ని మరింత అభివృద్ధి చేస్తామని సీఎంకు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల విజయేంద్ర రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, కర్నూలు మిల్స్ యూనియన్ ఎండి పరమేశ్వర రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ రాజేష్, సొసైటీ డైరెక్టర్లు విజయసింహారెడ్డి, యు.రమణ పాడి రైతు సరళమ్మ పాల్గొన్నారు.