BREAKING : ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్‌మెన్‌ల తొలగింపు

-

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తమ్ముడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు ఊహించని షాక్‌ తగిలింది. ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్‌మెన్‌లను తొలగిస్తూ కేసీఆర్‌ సర్కార్‌ కీలక నిర్నయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్‌ సర్కార్‌.

అయితే, ఈ వివాదంపై ఎర్రబెల్లి ప్రదీప్‌రావు స్పందించారు. తాను బీజేపీలో చేరినందుకే గన్‌మెన్‌లను ప్రభుత్వం తొలగించిందని ప్రదీప్‌రావు ఆరోపణలు చేశారు.. ఓ ఎమ్మెల్యే నా అంతు చూస్తానని బెదిరిస్తున్నాడు.. ఇలాంటి సమయంలో గన్‌మెన్‌ల తొలగింపు కక్షసాధింపు చర్యే అంటూ నిప్పులు చెరిగారు ప్రదీప్‌రావు. వెంటనే తనకు భద్రత పెంచాలని డిమాండ్‌ చేశారు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు.

Read more RELATED
Recommended to you

Latest news