వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా – కేశినేని నాని

-

బెజవాడ ఎంపీ కేశినేని నాని..మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు..బాబు టికెట్‌ ఇవ్వకున్నా ఇండీపెండెంట్‌ గా పోటీ చేస్తానని ప్రకటించారు. పార్టీలతో నాకు పని లేదు…ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంటుగా గెలిపిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని నేనెక్కడా చెప్పలేదు…చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకుంటే ఏమవుతుంది..? అని ప్రశ్నించారు.

మోడీని నిండు సభలో వ్యతిరేకించా.. అయినా బెజవాడలో పనులు ఆగాయా..? దటీజ్ కేశినేని నాని అని తెలిపారు. నన్ను.. నా పర్సనాల్టీని డీగ్రేడ్ చేయాలని చూడొద్దు..నన్ను డీ-గ్రేడ్ చేయాలని చూస్తే.. అంతగా నా పర్సనాల్టీని పెరుగుతుందని వివరించారు.

2013కు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువ ఉండేవని..చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకంతో నేను టీడీపీలో చేరానని వెల్లడించారు. నేను 2013లో టీడీపీలో చేరాకే వైసీపీలోకి వలసలు ఆగాయి…టాటా ట్రస్టుతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానని తెలిపారు. వంద చీరలు పంచి.. పది ట్రై సైకిళ్లు పంచి కొందరు దాన కర్ణుడులాగా కలర్ ఇస్తున్నారని పేర్కొన్నారు నాని.

Read more RELATED
Recommended to you

Latest news