బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్‌కు బ్రిటిష్-పాక్ నటుడు అలీ ఖాన్ ఫ్రెంచ్ కిస్ పెట్టారట. అది కూడా ఆమె భర్త అజయ్ దేవగణ్ లేనప్పుడట. కాజోల్ అంటే తనకు చాలా ఏళ్ల నుంచి క్రష్ ఉందని చెప్పుకొచ్చిన అలీ ఖాన్.. ప్రస్తుతం ఆమెతో కలిసి ‘ది గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ ఇంగ్లీష్‌లో వచ్చేయగా.. తాజాగా హిందీలో రీమేక్ చేస్తున్నారు.
ఈ సిరీస్‌లో కాజోల్, అలీ ఖాన్ లవర్స్‌గా నటిస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఫేమ్ సుపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా కాజోల్, అలీ ఖాన్ మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉందట. దాంతో తొలుత అలీ ఖాన్ భయపడినా.. కాజోల్ భర్త అజయ్ దేవగణ్ లేని సమయంలో ఆ సీన్‌ను చిత్రీకరించినట్లు ఈ బ్రిటిష్-పాక్ నటుడు చెప్పుకొచ్చారు.
“ముంబయిలోని ఓ హోటల్లో ఆ సీన్‌ను షూట్ చేశాం. అంతకు ముందు నేను చాలా టెన్షన్ పడ్డాను. కాసేపు చూయింగ్ గమ్ కూడా నమిలాను. రెండు మూడు సార్లు ప్రాక్టీస్ కూడా చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ప్రొఫెషనల్ యాక్టర్స్‌లా ఆ సీన్‌ను పూర్తి చేశాం. ఆమెనా క్రష్. ఆ విషయాన్ని ఆమెకు ముందే చెప్పడం వల్ల మరింత టెన్షన్ భయపడ్డాను. కానీ సీన్ తొందరగా పూర్తి చేయడం వల్ల కాజోల్ ‘థ్యాంక్యూ డార్లింగ్’ అని చెప్పి నవ్వేశారు.”
— అలీ ఖాన్, బ్రిటిష్-పాక్ నటుడు