హీరో రవితేజ కూడా ధమాకా, వీరయ్య విజయాలతో రీ రిలీజ్ బరిలోకి..!!

-

ఇక ఇప్పుడు తెలుగు లో స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్ ఒక ఉద్యమం లాగా ఉంది. ఈ రిలీజ్ రికార్డ్స్ కూడా సెట్ చేయాలని అందరు హీరోల ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు. ఇక తమ అభిమాన హీరో సినిమా చూడడం ను ఎంజాయ్ చేయాలి కాని సీట్లు చించడం, స్క్రీన్స్ చించడం, థియేటర్ లో మంటలు వేయడం చేసి హీరోల పరువు తీస్తున్నారు.వారి హీరో కు ఇది మంచి చేస్తుందా లేక చెడ్డ పేరు తీసుకు వస్తుందా అని కూడా ఆలోచించడం లేదు. ఇక కొంత మంది ఫ్యాన్స్ మాత్రం జెన్యూన్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇక ఈ రీ రిలీజ్ గోల లోకి రవితేజ ఫ్యాన్స్ కూడా దూకుతున్నారు. రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిరపకాయ్ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ను రవితేజ బర్త్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరో తేదీన మళ్లీ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్.

అసలే ఇప్పుడు రవితేజ కు సూపర్ హిట్స్ మహర్దశ నడుస్తోంది. 20 రోజుల క్రితం ధమాకా సినిమా తో 100 కోట్లు వసూళ్లు సాధించి యమ హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా లో కీలక పాత్ర పోషించి సినిమా విజయం లో ప్రముఖ పాత్ర వహించారు. అందుకే ఇంతకంటే బెస్ట్ మూమెంట్ ఎప్పుడూ రాదని ఫ్యాన్స్ రవితేజ పుట్టిన రోజు ను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news