WhatTheFish : “మనం.. మనం.. బరంపురం” అంటూ వచ్చేసిన మంచు హీరో

-

సినీ ఇండస్ట్రీలో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మంచు ఫ్యామిలీలో ఎటువంటి ట్రోల్స్ ఎదుర్కోని ఏకైక నటుడిగా కూడా ఈయన గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాలపరంగా.. వ్యక్తిత్వం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్.. వైవాహిక జీవితంలో మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడని చెప్పాలి.

2015లో తాను ప్రేమించిన అమ్మాయి ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నాడు. కానీ రెండు సంవత్సరాలు కూడా వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండలేకపోయారు. ఆ తర్వాత విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. త్వరలోనే భుమా మౌనికను మంచు మనోజ్‌ పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా, తాజాగా తన కొత్త సినిమాపై కీలక ప్రకటన చేశాడు ఈ మంచు హీరో. WhatTheFish అనే సినిమాను తాజాగా అనౌన్స్ చేశాడు. ఈ మేరకు టైటిల్‌ పోస్టర్‌ ను వదిలాడు మంచు మనోజ్‌. ఇక ఈ సినిమాకు “మనం.. మనం.. బరంపురం” అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news