సంక్రాంతి పర్వదినం సందర్భంగా టి ఎస్ ఆర్ టి సి బస్సులకు విశేష ఆదరణ లభించింది. ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రికార్డు స్థాయిలో 2.82 కోట్ల మంది ప్రయాణికులను టిఎస్ఆర్టిసి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం, ముందస్తు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణం టికెట్లు 10% రాయితీ కల్పించడం, టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లైన్లో ఏర్పాటు చేయడం వల్ల ఆర్టీసీ బస్సులను ప్రజలు ఎక్కువగా ఆదరించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా 11 రోజులలో మొత్తంగా రూ. 162.29 కోట్లు ఎక్కువగా రాబడి వచ్చింది. అంటే గత ఏడాదితో పోల్చితే దాదాపు 12 లక్షల మంది అదనంగా బస్సుల్లో ప్రయాణించారు. టిఎస్ఆర్టిసి బస్సులో ప్రయాణం సురక్షితమనే విషయాన్ని ప్రజలు మరోసారి నిరూపించారు.