చిన్న పిల్లలను చూస్తే.. ఎవరైనా ముందు చేసి పని బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం.. అంత క్యూట్‌గా ఉంటారు.. చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ నవజాత శిశువుకు మాత్రం ముద్దు పెట్టడం అనేది అస్సలు మంచి విషయం కాదట..! అది వారి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అసలు నవజాత శిశువును ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో.. ఎందుకు వారికి ముద్దు పెట్టకూడదంటున్నారో చూద్దామా..!
క్రిములు సులభంగా వ్యాప్తి చెందుతాయి..
సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందడానికి శారీరక సంబంధం అత్యంత సాధారణ మార్గం. నవజాత శిశువులకు ఇది హాని కలిగించే ప్రక్రియ. అందుకే పిల్లలను అనవసరంగా తాకకుండా ఉంటేనే మంచిది.. వారికి రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. త్వరగా అనారోగ్యం బారిన పడతారు…
శ్వాస సంబంధిత ప్రమాదాలు..
ఊపిరితిత్తులు పూర్తిగా పరిపక్వం చెందడానికి సుమారు 8 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి నవజాత శిశువు శ్వాసకోశ వ్యవస్థ అంత త్వరగా అభివృద్ధి చెందదనే విషయాన్ని మనం గుర్తించాలి. ముద్దు ద్వారా శిశువుకు శ్వాసకోశ వ్యాధిని వ్యాప్తి చేసే ఏదైనా వైరస్ సోకే ప్రమాదముంది.
చర్మ సమస్యలు కూడా..
పెద్దలు తరచుగా వారి ముఖానికి చర్మ సంరక్షణ ఉత్పత్తులు లేదా మేకప్‌ని వాడతారు.. ఈ ఉత్పత్తులు ద్వారా ఎదురయ్యే తక్షణ ప్రమాదాల నుంచి పెద్దలకు సమస్యలు లేనప్పటికీ.. పిల్లలకు అలా కాదు. మేకప్ ప్రొడెక్ట్స్‌లో ఉండే రసాయనాల వల్ల శిశువలకు కొన్ని తీవ్రమైన చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఫ్లూ
ఫ్లూ అనేది పెద్దలకు ఒక చిన్న వ్యాధి. కానీ శిశువులకు మాత్రం అదే పెద్ద వ్యాధి.. శిశువుకు పెట్టే ఒక ముద్దు సాధారణ జలుబు లేదా స్పర్శ ద్వారా ఫ్లూని వ్యాపిస్తుంది..
కాబట్టి నవజాత శిశువులకు ముద్దు పెట్టకపోవడమే ఉత్తమం.. అలాగే వారిని అందరూ తాకకూడదు.. తల్లి, ఇంకా ఒకరు మాత్రమే వారి సంరక్షణ చూసుకోవాలి. వాళ్లు కూడా చాలా హైజినిక్‌గా ఉండాలి. శిశువు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.