దాదాపు పది సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక కామెడీ ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్. జబర్దస్త్ మొదటి నుంచి నాగబాబు, రోజా జడ్జెస్ గా ఉన్నారు. జబర్దస్త్ కి వారిద్దరూ ప్రధాన ఆకర్షణ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సంవత్సరాల తరబడి వాళ్ళ జర్నీ సాగింది.. అయితే 2019లో నాగబాబు జబర్దస్త్ గుడ్ బై చెప్పి.. వస్తూ వస్తూ మల్లెమాల సంస్థపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. దోచుకోవడమే కానీ కనీసం మంచి ఆహారం కూడా పెట్టరు అంటూ పలు ఆరోపణలు చేశారు నాగబాబు. అయితే అదే సమయంలో నాగబాబు స్థానంలో ఎవరు వస్తారు అనే వార్తలు వినిపించగా.. సింగర్ మనో తెరపైకి వచ్చారు. చాలా కాలం సింగర్ మనో , రోజా జబర్దస్త్ జడ్జెస్ గా చేశారు.
రోజాను మంత్రి పదవి వరించడంతో ఆమె జబర్దస్త్ గుడ్ బై చెప్పగా.. నిబంధనల రీత్యా మంత్రి పదవిలో ఉన్నవారు ఇతర వృత్తుల్లో కొనసాగకూడదు.. అలాగే ప్రజా ప్రతినిధిగా మంత్రి హోదాలో ఆమె బాధ్యతలు మరింత పెరిగాయి. దీంతో జబర్దస్త్ వదిలేసి వెళ్లిపోయారు. పలువురు ఆమె ప్లేస్ లోకి వచ్చారు. ఇంద్రజ అందరికంటే బాగా మెప్పించి సెటిల్ అయిపోయింది. ఇంద్రజ సింగర్ మనో చాలా ఎపిసోడ్స్ లో జడ్జెస్ గా కనిపించారు. మెల్లగా సింగర్ మనో కూడా జబర్దస్త్ కి దూరమయ్యాడు. ఆ ప్లేస్లో కృష్ణ భగవాన్ ఎంటర్ అయ్యాడు.
ఇదిలా ఉండగా ఎందుకు జబర్దస్త్ మనో మానేశాడు అనే చర్చ నడిచింది. మల్లెమాలతో ఆయనకు విభేదాలు ఉన్నాయని అందుకే జబర్దస్త్ మానేశాడు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయంపై మనో మాట్లాడుతూ.. కోవిడ్ కారణంగానే నేను ఒప్పుకున్న కొన్ని షో లు పెండింగ్లో ఉన్నాయి. ఇళయరాజా , ఏఆర్ రెహమాన్ తో కొన్ని షోలు చేయాల్సి ఉంది. ముందుగా ఒప్పుకున్న ఈవెంట్ పెండింగ్లో ఉన్న షోలను పూర్తి చేయడానికి జబర్దస్త్ గ్యాప్ ఇచ్చాను. అంతకుమించి మరే కారణం లేదు అంటూ సింగర్ మనో వివరణ ఇచ్చారు.