భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అధికారంలోకి రాగానే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజ్వేషన్లు అమలు చేస్తామని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నాందేడ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. మహిళల ప్రాతినిధ్యం ఉన్న సమాజం అద్భుతంగా ప్రగతి సాధిస్తుందని సీఎం స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం.
ఆ హామీని ఏడాదిలోపే అమలు చేస్తాం. మహిళలను కేంద్రం చిన్నచూపు చూస్తోంది. మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే అభివృద్ధి సాధ్యం. అన్ని రంగాల్లోనూ వారి ప్రాధాన్యం పెంచుతాం. బేటీ పడావో.. బేటీ బచావో మాటలకే పరిమితం అయింది. ఉత్తర భారతదేశంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. హథ్రస్ ఘటన మహిళలకు రక్షణ లేదని నిరూపించింది అని కేసీఆర్ గుర్తు చేశారు.