కొత్త సెక్రటేరియట్ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు ఉన్నాయి.. సీబీఐ విచారణ జరపాలి : కేఏ పాల్‌

-

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ తెలంగాణ సెక్రటేరియట్‭లో జరిగిన అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వాస్తు పిచ్చితో, మూఢ నమ్మకాలతో సెక్రటేరియట్‭ను కూల్చేశాడని ఆరోపించారు. కూల్చివేతపై హైకోర్టులో పిల్ దాఖలు చేశామన్న ఆయన.. దీనిపై సీబీఐ డైరెక్టర్, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశానని చెప్పారు. తన ఫోన్ ట్యాప్ చేసి.. సెక్రటేరియట్ దగ్గరికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

- Advertisement -

అగ్నిప్రమాదం వెనక మర్మం ఏదో దాగుందని.. వెంటనే సెక్రటేరియట్‭ను క్రైమ్ జోన్‭గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదంపై కాంగ్రెస్, బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నాయని కేఏపాల్ ప్రశ్నించారు. ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త సెక్రటేరియట్‭కు అంబేద్కర్ పేరు పెట్టాడని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజునే సెక్రటేరియట్‭ను ఎందుకు ఓపెన్ చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. సెక్రటేరియట్ ప్రారంభోత్సవాన్ని అన్ని వర్గాల ప్రజలు బహిష్కరించాలని పాల్ పిలుపునిచ్చారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...