నాపై కోడిగుడ్లు విసిరారు : చిరంజీవి

-

తెలుగు సినిమా పరిశ్రమలో చాలా రోజులు నంబర్ వన్ గా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి,తెలుగు సినిమా పై తనదైన ముద్ర వేశారు. తాను వచ్చిన తర్వాత మాత్రమే తెలుగు సినిమాలలో పైట్లకు పాటలకు, మంచి గుర్తింపు వచ్చింది. అలాగే రెమ్యునరేషన్ పరంగా ఇండియాలోనే అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ తీసుకొని బిగ్గర్ దెన్ బచ్చెన్ గా ఇండియాటుడే లో ప్రముఖుడుగా పేరు పొందారు. అలాగే దాసరి నారాయణరావు తర్వాత పరిశ్రమను నడిపించే పెద్ద దిక్కుగా వున్నారు.

ఇది ఇలా ఉండగా, తెలుగులో ఓటీటీ లో మరో టాక్స్ షో రాబోతోంది. నటి స్మిత హోస్ట్ గా నిజం విత్ స్మిత అంటూ సోనీ లివ్ లో ఫిబ్రవరి 10వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ షో లో మొదటి ఎపిసోడ్ కష్టేఫలిడ్ మొబిలిటీ అనే పేరుతో మెగాస్టార్ చిరంజీవితో స్ట్రీమింగ్ కానుంది. అయితే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. ఇక ఈ ప్రోమోలో చిరంజీవి ఫస్ట్ క్రష్ మరియు స్టార్ డం వచ్చే క్రమంలో జరిగిన అవమానాల గురించి స్మిత అడిగారు. దానికి చిరంజీవి బదులు ఇస్తూ… తాను కెరీర్ లో చాలా కష్టాలు పడ్డానని… ఒకానొక సమయంలో నాపై గతంలో కోడిగుడ్లు కూడా విసిరారంటూ చిరంజీవి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news