America : మిచిగాన్ వర్సిటీలో కాల్పులు.. ముగ్గురు మృతి

-

అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు మోత మోగించాయి. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలో ఓ దుండగులు అకస్మాత్తుగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురు గాయపడినట్లు సమాచారం. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించినట్లు పోలీసు అధికారి క్రిస్ రోజ్‌మాన్ తెలిపారు. కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

వ‌ర్సిటీ క్యాంప‌స్‌లో ఉన్న బెర్కీ హాల్‌లో కాల్పులు జ‌రిగ‌న‌ట్లు పోలీసులకు రాత్రి స‌మాచారం వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో అక్క‌డ ఉన్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. అనేక మంది బాధితుల్ని పోలీసులు గుర్తించారు. ఆ త‌ర్వాత మ‌రో బిల్డింగ్ వ‌ద్ద కూడా కాల్పుల శ‌బ్ధాలు వినిపించాయి. ఈ ఘటన తర్వాత దుండగుడు ఆ ప్రాంతం నుంచి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో చిక్కినట్లు పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news