టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ లో అభిమానులు ఉన్నారు.. మొన్నటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో దూసుకుపోయిన రామ్ చరణ్.. ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు అని తెలిసి ప్రతి ఒక్కరు ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఆగస్టులో ఉపాసన బిడ్డకు జన్మనివ్వబోతుందని ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా అభిమానులతో పంచుకున్నారు..
ఇదిలా ఉండగా తాజాగా హీరో రామ్ చరణ్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఆయన ఒక హీరోయిన్ పై మనసు పారేసుకున్నాడు అనే వార్తలు ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ అంటే అందరూ ఇష్టమని చెబుతున్నారు.. కానీ మరి రామ్ చరణ్ కి ఇష్టమైన హీరో హీరోయిన్లు ఎవరు అనేది మాత్రం ఆయన చెప్పడం లేదు.. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ తనకు కొంతమంది హీరోయిన్లు అంటే ప్రత్యేకమైన ఇష్టమని.. వారిపై మనసు పారేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
అలాంటి వారిలో మొదటి వ్యక్తి జూలియా రాబర్ట్స్ .. నన్ను చాలా ఎట్రాక్ట్ చేసేది. టీవీలో ఆమె కనబడిన ప్రతిసారి నేను స్క్రీన్ కు అతుక్కుపోయేవాడిని. దాన్ని అబ్సెషన్ అంటారో? లేదో? తెలియదు కానీ ఆమెలో ఏదో తెలియని స్పెషాలిటీ ఉంది. ఆమెకు నేను డైహార్డ్ ఫ్యాన్ ని . ‘ప్రెట్టీ ఉమెన్’లో చూసి ఆమెతో ప్రేమలో పడిపోయాను. ‘ఎంట్రాప్ మెంట్’లో కేథిరిన్ యాక్టింగ్ చూసి ఫ్యాన్ అయిపోయాను. నేను ఆమెని ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె నటించిన ‘ది మాస్క్’.. నాకు చాలా ఇష్టం. అప్పటినుంచే ఆమెని ఫాలో కావడం స్టార్ట్ చేశాను అని చరణ్ చెప్పుకొచ్చాడు.