హతవిధీ..! దేవుడు కనిపిస్తే చేతులెత్తి మొక్కే కాలం పోయింది..

-

ఒకప్పుడు దేవుని విగ్రహం, గుడి లేదా చిత్రపటం కనబడితే ఒక్క క్షణం ఆగి దైవాన్ని స్మరించుకుని ముందుకు సాగేవాళ్లం. టైం లేదనుకుంటే.. గుడిలోకి వెళ్లకుండానే ఒక్క నిమిషం పాటు ఆగి ఆ దైవాన్ని గుర్తు చేసుకుని, మనస్సులో ప్రార్థించి ముందుకు సాగేవాళ్లం.

స్మార్ట్‌ఫోన్ల పుణ్యమా అని మనం ఎంతో కష్టమైన పనిని కూడా ఇప్పుడు చాలా సులభంగా చేస్తున్నాం. అరచేతిలో ప్రపంచాన్ని చుట్టి వస్తున్నాం. అనేక రకాలుగా మనకు ఆ ఫోన్లు ఉపయోగపడుతున్నాయి. అయితే అంత వరకు బాగానే ఉన్నా.. టెక్నాలజీ మోజులో పడి మనం పాటించాల్సిన కొన్ని సూత్రాలను, నియమాలను మరిచిపోతున్నాం. మనుషులమనే మాట పక్కన పెట్టి మెదడు, విచక్షణా జ్ఞానం లేని వారిగా ప్రవర్తిస్తున్నాం. అవును.. సమాజంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అదే..!

ఒకప్పుడు దేవుని విగ్రహం, గుడి లేదా చిత్రపటం కనబడితే ఒక్క క్షణం ఆగి దైవాన్ని స్మరించుకుని ముందుకు సాగేవాళ్లం. టైం లేదనుకుంటే.. గుడిలోకి వెళ్లకుండానే ఒక్క నిమిషం పాటు ఆగి ఆ దైవాన్ని గుర్తు చేసుకుని, మనస్సులో ప్రార్థించి ముందుకు సాగేవాళ్లం. కానీ స్మార్ట్‌ఫోన్ల పుణ్యమా అని దైవానికి మొక్కడం ఎప్పుడో మరిచిపోయాం. పోజులు పెట్టి సెల్ఫీలు తీసుకుని ఫలానా దేవుడి దగ్గర ఉన్నామంటూ.. సోషల్ మీడియాలో ఫొటోలను పోస్ట్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. సాంకేతికత మత్తులో పడి అసలు పాటించాల్సిన నియమాలను మనం ఎప్పుడో గాలికొదిలేశాం.

ఒకప్పుడు భగవంతుడు కనబడితే రెండు చేతులు ఎత్తి నమస్కరించేవారు. కానీ నేడు అలా కాదు. దైవం కనబడితే చేతులెత్తుతున్నారు. కానీ వాటి మధ్యలో సెల్‌ఫోన్ ఉంటోంది. ఆ ఫోన్ చక చకా ఫొటోలను తీస్తోంది. అంతే కానీ.. దైవానికి మొక్కాలన్నా జ్ఞానం ఆ చేతులకు ఉండడం లేదు. ఏం చేస్తాం.. కలికాలం.. ఇంకా ముందు ముందు ఇలాంటి ఎన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో.. ఓ దేవుడా.. నువ్వు కనిపిస్తే సరిగ్గా మొక్కేందుకు కూడా మాకు చేతులు రావడం లేదు. మా చేతగానితనాన్ని క్షమించు. మా అజ్ఞానాన్ని మన్నించు..!

Read more RELATED
Recommended to you

Latest news